PBKS v RCB Qualifier1 History IPL 2025 | ఐపీఎల్ రెండో రౌండ్ లో ఆర్సీబీకే అనుభవం ఎక్కువ | ABP Desam

Continues below advertisement

 ఈ ఐపీఎల్ సీజన్ లో పోటా పోటీ విజయంతో క్వాలిఫైయర్ 1 వరకూ అర్హత సాధించిన వచ్చేసిన పంజాబ్, ఆర్సీబీ ఇక ఫైనల్ కి ఒక్క అడుగు దూరంలో నిలబడ్డాయి. ఇవాళ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకునే అవకాశం ఉండటంతో రెండు జట్లు హోరా హోరీ తలపడటం ఖాయం. ఇవాళ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది కానీ స్వేచ్ఛగా ఆడుకుని ఫైనల్ కి వెళ్లిపోవాలంటే మాత్రం ఇవాళ గెలవటం ఆర్సీబీ, పంజాబ్ జట్లు రెండింటికీ అవసరం. చరిత్ర చూసుకుంటే ఈ రెండు జట్లు ఇప్పటి జట్లు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవలేదు. కానీ ఆర్సీబీ కి మూడు సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉంది చరిత్రలో. 2009లో కుంబ్లే కెప్టెన్సీలో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆర్సీబీ అప్పుడు డెక్కన్ ఛార్జర్స్ మీద ఓటమి చవి చూసింది. తర్వాత 2011లో డేనియల్ వెట్టోరి కెప్టెన్సీలో మరోసారి ఫైనల్ కి  చేరుకున్న ఆర్సీబీ అప్పుడు సీఎస్కేలో చేతిలో పరాజయం పాలైంది. తిరిగి 2016లో విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ ఆడిన ఆర్సీబీ సన్ రైజర్స్ చేతిలో ఓడి మూడోసారి కప్ చేజిక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. సో ఈసారి ఎలా అయినా కప్ కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఆర్సీబీకి ఇవాళ క్వాలిఫైయర్ 1 నెగ్గటం చారిత్రక అవసరం. మరో వైపు పంజాబ్ కు ఆర్సీబీ తో పోలిస్తే ఐపీఎల్ రెండో రౌండ్ దాటడంలో తక్కువ అనుభవం ఉంది. ఆ జట్టు ఇప్పటివరకూ రెండుసార్లు మాత్రమే సెకండ్ రౌండ్ కి వెళ్లగలిగింది. 2008లో ఫస్ట్ సీజన్ లో యువరాజ్ కెప్టెన్సీలో సెమీస్ ఆడిన పంజాబ్, తిరిగి 2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో తమ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. సో 11ఏళ్ల తర్వాత పంజాబ్ కి వచ్చిన అవకాశం ఇది ఫైనల్ కి వెళ్లేందుకు ఆర్సీబీని ఇవాళ ఓడిస్తే చాలు….తర్వాత ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 పూర్తి చేసుకున్న జట్టు ఫైనల్ లో ఎదురు పడుతుంది ప్రశాంతంగా ఆడుకోవచ్చు. చూడాలి మరి చరిత్ర లో ఉన్న అనుభవాన్ని వాడుకుని ఆర్సీబీ పై చేయి సాధిస్తుందా లేదా ప్రజెంట్ ఫామ్ ను బలంగా చాటుతూ పంజాబ్ మొదటి పంచ్ ఇచ్చి ఫైనల్ చేరుతుందా ఈ రోజు రాత్రికి తేలిపోనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola