Pat Cummins Loss IPL 2024 | KKR vs SRH మ్యాచ్ ఓటమితో కమిన్స్ విజయాలకు గండి | ABP Desam
ప్యాట్ కమిన్స్ అంటే చాలు..గడచిన ఏడాదిన్నర భారీ టోర్నీలు గెలిపించే కెప్టెన్ అనే ముద్ర. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ లను ఆస్ట్రేలియాకు గెలిపించటం తో ఈ పేరు వచ్చింది అతనికి. అలాంటోడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ 20కోట్ల 50లక్షలకు కొనుక్కుని సన్ రైజర్స్ కి కెప్టెన్ గా నియమించగానే ఆ లక్కీ ఛార్మ్ సన్ రైజర్స్ కి వస్తుందని అనుకున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ ఏడాది కప్ మనదే అని నినాదాలు కూడా రెడీ చేసుకున్నారు. సన్ రైజర్స్ ఆడిన విధానం కూడా అది నిజం అవుతుందేమోనని అనిపించేలా చేసింది. ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ లు గెలిపించి పెట్టడంతో కీలక పాత్ర పోషించిన హెడ్ కూడా సన్ రైజర్స్ లో ఉండంటం..భయంకరంగా బాదటంతో ఆరెంజ్ ఆర్మీదే కప్ అని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్ కి కోల్ కతా నైట్ రైడర్స్ షాక్ ఇచ్చింది. లీగ్ స్టేజ్ లో ఓసారి, క్వాలిఫైయర్ 1లో ఓసారి సన్ రైజర్స్ ను చిత్తు చేసిన కేకేఆర్..వార్నింగ్ సిగ్నల్స్ ను పంపించింది. ఓటమి నుంచి కోలుకుని కష్టపడి ఫైనల్ కి చేరినా మళ్లీ కేకేఆరే ఎదురై ఈసారి ఏకంగా కప్ కొట్టుకెళ్లిపోయింది. పనిలో పనిగా భారీ టోర్నీలు గెలవగలడనే కెప్టెన్ కమిన్స్ ఖాతాలో ఓ ఓటమిని పడేసి కమిన్స్ విన్నింగ్ స్ట్రీక్ ను ఈ ఐపీఎల్ వీక్ చేసింది.