Nicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్

Continues below advertisement

గతేడాది పర్ ఫార్మెన్స్ చూసిన లక్నో సూపర్ జెయింట్స్ మొన్న ఆక్షన్ లో నికోలస్ పూరన్ కోసం 21 కోట్లు పెట్టినప్పుడు అందరూ వింతగా చూశారు కానీ ఈ సీజన్ లో అతని ఆట చూస్తుంటే గోయెంకా నిర్ణయం సరైందనే అనిపించక తప్పదు. అంతలా పూనకాలెత్తిపోయి మరీ ఆడుతున్నాడు నికోలస్ పూరన్. నిన్న మ్యాచ్ లో సహచర ఆటగాడు మిచ్ మార్ష్ తో కలిసి పూరన్ కోల్ కతా బౌలింగ్ ను ఊతకొట్టుడు కొట్టాడు. 36 బాల్స్ లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో పూరన్ సృష్టించిన 87 పరుగుల విధ్వంసానికి LSG స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మిచ్ మార్ష్ కూడా 81 పరుగులు చేయటంతో LSG కోల్ కతాకు 239 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వగలిగింది. ఈ సీజన్ లో ఐదు మ్యాచుల్లో పూరన్ ఇప్పటి వరకూ 288 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 225. ఈ ఐదు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 24 సిక్సర్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్ నా జన్మ హక్కు అన్నట్లు తన దగ్గరే ఉంచుకుంటున్నాడు. సెకండ్ ప్లేస్ లో తన సహచర ఆటగాడైన మిచ్ మార్షే తనకు కాంపిటీషన్ గా ఉన్నారు తప్ప మరో ప్లేయర్ వీళ్ల దగ్గర్లో కూడా లేరు. పూరన్ స్టైల్ ఏంటే తను ఒకరు ఇద్దరు బౌలర్లను కంప్లీట్ గా టార్గెట్ చేసి కొడతాడు ఎంతెలా అంటే వాళ్ల నుంచి ఇక ఎన్ని పరుగులు వీలైతే అన్ని పరుగులు లాగిపారేస్తాడు. నిన్న మ్యాచ్ లో రస్సెల్, హర్షిత్ రానాలను అలాగే టార్గెట్ చేశాడు పూరన్. హర్షిత్ బౌలింగ్ లోవరుసగా రెండు సిక్సులు బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్... ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో రస్సెల్ వేసిన ఓవర్ లో నాలుగు ఫోర్లు రెండు సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. డోంట్ స్టాప్ హిట్టింగ్ పూనకాలు లోడింగ్ అన్నట్లు పూరన్ చేస్తున్న మాస్ బ్యాటింగ్ తో LSG సీజన్ లో మూడో విజయాన్ని నమోదు చేయటం తో పాటు టాప్ స్కోరర్ గానూ లీగ్ లో దూసుకెళ్తున్నాడు పూరన్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola