Devon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

 పంజాబ్ మీద 220 పరుగుల ఛేజింగ్ లో సీఎస్కే ఓడిపోవటానికి కారణంగా డెవాన్ కాన్వే ను రిటైర్డ్ అవ్వమనటమే అంటూ కొంత మంది సీఎస్కే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ముంబైలో తిలక్ ను రిటైర్డ్ అవ్వమని పాండ్యా అవమానించాడని..అలాగే ఇక్కడి కాన్వేని రిటైర్డ్ అవ్వమని ధోని తప్పు చేశాడని అంటున్నారు. హాఫ్ సెంచరీ కొట్టిన కాన్వే క్రీజులో ఉండి ఉంటే ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేసేవాడు అనేది వాళ్ల అభిప్రాయం. ఆఖరి 13 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన టైమ్ లో ధోని సలహాతో కాన్వే రిటైర్డ్ అవుట్ అయ్యి వెళ్లిపోయి జడేజాను పంపించాడు. దీనికి రీజన్ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత 13 బంతులను ఆడిన కాన్వే ఒక్క బౌండరీ కూడా కొట్ట లేకపోయాడు. 17.4 ఓవర్ వచ్చినా టార్గెట్ 220 ఉన్నా 24 బంతుల పాటు సీఎస్కే ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది. ఇది కరెక్ట్ కాదని భావించిన ధోని పంజాబ్ బౌలర్ లోకీ ఫెర్గ్యూసన్ ను టార్గెట్ చేసి సిక్సర్ బాదాడు. వెంటనే తనకు నాన్ స్ట్రైక్ ఎండింగ్ లో జడేజా ఉంటేనే కరెక్ట్ అని భావించి కాన్వేను రిటైర్డ్ అవుట్ అవ్వమని చెప్పాడు. 49 బంతుల్లో 69 పరుగులు చేశాడు కాన్వే. వాస్తవానికి రిటైర్డ్ అవుట్ ఇంకా ముందే అయ్యి ఉంటే బాగుండేది. అప్పటికే చాలా బంతులు వృథా అయిపోయాయి. కాన్వే వెళ్లిన తర్వాత ఫెర్గ్యూసన్ వేసిన ఆఖరి బంతినీ ధోని సిక్సర్ బాదాడు. నెక్ట్స్ ఓవర్ లో అర్ష్ దీప్ ను కూడా టార్గెట్ ఓ సిక్సర్, ఓ ఫోర్ తో 15 పరుగులు రాబట్టాడు ధోనీ. ఆ తర్వాత లాస్ట్ ఓవర్ లో చెన్నై గెలవాలంటే ఓవర్ లో 28 పరుగులు కొట్టాలంటే పంజాబ్ బౌలర్ యశ్ ఠాకూర్ వేసిన మొదటి బంతికే ధోనీ అవుటవటంతో చెన్నై కథ ముగిసిపోయింది.  వాస్తవానికి కాన్వే రిటైర్డ్ అవుట్ ముందే అయ్యుంటే ఆ తినేసిన 13 బంతుల్లో కనీసం రెండు బౌండరీలు వచ్చినా చెన్నై గెలిచేందుకు ఆస్కారం ఉండేది. అది జరగకపోవటంతోనే చెన్నై 18 పరుగుల లోటుతో మ్యాచ్ ను పంజాబ్ కు కోల్పోయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola