Mumbai Indians Under Hardik Pandya Captaincy | తీస్ మార్ ఖాన్ అనుకుంటే... కొంప ముంచిన పాండ్య | ABP

Continues below advertisement

Mumbai Indians Under Hardik Pandya Captaincy |  అగో.. కేసీఆర్ చెప్పినట్లే ఉంది ముంబయి ఇండియన్స్ ముచ్చట. 5 కప్పులు కొట్టిన మగాడు టీమ్ లో ఉండగా... ఇంకో మొనగాడిని కెప్టెన్ జేసిండ్రు. కట్ చేస్తే... పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో కూర్చొంది ముంబయి ఇండియన్స్. 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలే సాధించింది. 
గుజరాత్ టైటాన్స్ ను ఓ సారి విన్నర్ గా ..రెండోసారి రన్నరప్ గా నిలబెట్టిన హర్దిక్ పాండ్య..ముంబయిని ఆకాశానికి తీసుకెళ్తాడని మేనేజ్మెంట్ భావించి..జట్టులోకి తెచ్చి కెప్టెన్సీ అప్పగించింది. ఇది బాగానే ఉంది కానీ రోహిత్ శర్మ కు ఈ విషయాన్ని కన్విన్స్ చేసి కెప్టెన్సీ చేసి ఉంటే బాగుండేది. కానీ, అలా జరగలేదు. దీంతో.. ముంబయి ఇండియన్స్ టీమ్ రెండు ముక్కలుగా ఐంది. రోహిత్ గ్రూప్, హర్దిక్ గ్రూప్. దీంతో..డ్రెస్సింగ్ రూమ్ లో సఖ్యతలేని  వీరు గ్రౌండ్ లో ఏం ఆడతారు..! అదే జరింది.. ఓక జట్టుగా అంతా విఫలమయ్యారు. కనీసం హార్దిక్ పాండ్య కెప్టెన్ గా ఏమైనా ఇరగదీశాడా అంటే అది లేదు..! ఒక్కహాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 46 పరుగులతే అతడి అత్యధిక స్కోర్. టాప్ ఆర్డర్ అంతా స్పీడ్ గా ఆడుతుంటే.. 15 ఓవర్ లో వచ్చి 120 స్ట్రైక్ రేట్  తోబ్యాటింగ్ చేస్తూ మరి చిరాకు తెప్పించాడు పాండ్య. ఇక బౌలింగ్ విషయానికొస్తే 14 మ్యాచుల్లో 11 వికెట్లే తీశాడు. ఎకానమీ 10 ప్లసే ఉంది. అలా.. ఒక కెప్టెన్ గా ప్లేయర్స్ ను ఒక జట్టుగా కలుపుకోవడంలో... ఒక ప్లేయర్ గా ఇండివిజువల్ స్టాటిటిక్స్ లో వెనుకబడిపోయాడు హార్దిక్ పాండ్య. అందుకే..  ఏరికోరి మొగున్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నినట్లు తయారైంది ముంబయి పరిస్థితి అని ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఫీలవుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram