Arjun Tendulkar vs Nicholas Pooran | పూరన్ దెబ్బకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా..? | ABP Desam

Continues below advertisement

Arjun Tendulkar vs Nicholas Pooran లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్‌కు.. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా? అంటే సోషల్ మీడియాలో అవుననే పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్జున్ కంటే సచిన్ టెండూల్కరే బెటర్ బౌలర్ ని ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. ఎందుకంటే..  నిన్న లక్నోతో జరిగిన చివరి మ్యాచులో జట్టులోకి అర్జున్ టెండూల్కర్ ను హర్దిక్ పాండ్య తీసుకున్నాడు. అది కూడా బూమ్రా ప్లేస్ లో. ఐతే.. పవర్ ప్లే లో 2 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ మంచిగానే బౌలింగ్ వేశాడు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. ముఖ్యంగా తన తొలి ఓవర్‌లో స్టోయినిస్ ను ఔట్ చేసినంత పని చేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిడిల్ ఓవర్లలో మూడో ఓవర్ వేయడానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో పూరాన్ వరుసగా రెండు సి క్సులు కొట్టాడు. ఐతే.. మూడో బాల్ వేసే సమయానికి పిక్క కండరాలు పట్టేయడంతో డగౌట్ లోకి వెళ్లి కూర్చొన్నాడు. ఐతే..పెయిన్ ఉన్న వాడు వెళ్లి థెరపీ చేయించుకోవాలి కానీ డగౌ ట్ లో కూర్చోని మ్యాచ్ చూడటమేంటని ఫ్యాన్స్ ఆశ్యర్చం వ్యక్తం చేశారు. అంటే..పూరాన్ భారీ సిక్సలు కొట్టడంతో బౌలింగ్ వేయకుండా భయపడి మైదానం వీడాడా..?అంటూ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కొడుకు 2 సిక్స్‌లకే వెనకడుగు వేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అలా.. ఒక్క వికెట్ తీయకపోయినా ట్రెండింగ్ లో ఉన్నాడు అర్జున్ టెండూల్కర్..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram