MS Dhoni Takes Blame for Loss | IPL 2025 RCB vs CSK మ్యాచ్ ఓడిపోవటానికి కారణం నేనే | ABP Desam
ధోనీ అంటే విజయాల్లో మాత్రమే క్రెడిట్ తీసుకుంటాడని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. వాస్తవానికి ధోని విజయాల్లో ఎప్పుడూ మాట్లాడాడు అయితే ఇది టీమ్ ఎఫర్ట్ అంటాడు లేదంటే గెలవటానికి కారణాలన విశ్లేషిస్తాడు కానీ ఓటముల్లో మాత్రం అది కెప్టెన్ గా తన బాధ్యత తనే బాధ్యతను తీసుకుంటానని చెప్తాడు. ఈ మధ్యలో ఆయన కాలంలో కెప్టెన్సీ బాద్యతల్లో లేరు కాబట్టి అలాంటి మాటులు వినట్లేదు కానీ నిన్న ఆర్సీబీ తో 2 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు. తను క్రీజులోకి వచ్చే సరికి 4ఓవర్లలో 40 కి పైగా పరుగులు కొట్టాలన్న ధోనీ అప్పటివరకూ మాత్రే, జడేజా కలిసి అద్భుతంగా ఆడారన్నారు. ఓవర్ కి పది రన్ రేట్ రిక్వైర్డ్ ఉండే మ్యాచుల్లో ఎలా ఆడాలో తనకు తెలుసన్న ధోనీ అయితే దాన్న సక్సెస్ ఫుల్ గా అమలు చేయలేకపోయానన్నాడు. ఆఖరి బంతికి 15పరుగులు చేస్తే చాలు చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది. అలాంటి టైమ్ లో 8 బాల్స్ ఆడిన ధోని ఓ సిక్సర్ తో 12పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత వచ్చి దూబే నోబాల్ కి సిక్స్ కొట్టి మళ్లీ ఆశలు పెంచినా ఆ తర్వాత బౌండరీ రాకపోవటంతో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే తను ఉన్నప్పుడు పరిస్థితి చేతుల్లోనే ఉందని..తనే ఇంకో రెండు మూడు షాట్స్ కొట్టి ఉంటి మ్యాచ్ గెలిచేవాళ్లమన్న ధోనీ..ఓటమికి తనే బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. విజయాల్లోనే కాదు ఓటముల్లోనూ క్రెడిట్ తనదే అని చెబుతున్న ధోనీ తన నిజాయితీని మరోసారి బయటపెట్టుకున్నాడు. అయితే ఆర్సీబీ సహా మిగిలిన టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం ధోనినే ఈ సీజన్ లో చెన్నై ఓటములకు కాఱణం కాబట్టి తను తప్పుకుని యువకులకు ఛాన్స్ ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.