Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
ధోని తయారు చేసిన వజ్రాయుధం, శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరానా పంట పండింది. నాలుగేళ్ల పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడి ఈ ఏడాది మినీ వేలానికి ముందు బయటకు వచ్చిన పతిరానాకు భారీ అమౌంట్ దక్కింది. అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో మతీశా పతిరానాను 18కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. కేమరూన్ గ్రీన్ ను 25 కోట్ల 20 లక్షలకు కొన్న కేకేఆరే...పతిరానా కోసం ఎల్ఎస్జీతో బీభత్సంగా పోటీ పడింది. చివరకు 18కోట్ల రూపాయలకు లంక పేసర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. నాలుగేళ్ల పాటు సీఎస్కేకు ఆడిన పతిరానా నాలుగు సీజన్లలో 47 వికెట్లు తీశాడు. మలింగను పోలిన బౌలింగ్ తో పదునైన యార్కర్లలో డెత్ ఓవర్లలో చెన్నైకి సంచలన విజయాలను అందించాడు పతిరానా. అంతే కాదు ధోనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన పతిరానా ఇప్పుడు చెన్నై ప్రత్యర్థిగా ఎలా మ్యాచ్ లు ఆడనున్నాడో ఆసక్తికరంగా మారనుంది.