KKR vs SRH IPL 2024 Pat Cummins | వాడి చెయ్యి పడితే కానిది లేదు..ఐపీఎల్ కూడా కొట్టేస్తాడా.? | ABP
ప్యాట్ కమిన్స్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్. ఫార్మాట్ తో అతనికి సంబంధం లేదు. మ్యాచ్ లు గెలిపించటమే తెలుసు. తన టీమ్ ను విశ్వవిజేతగా నిలబెట్టడమే తెలుసు. ఇది ప్రూవ్డ్ కూడా. ఏడాది రెండేళ్లుగా అతడు సాధిస్తున్న విజయాలే అందుకు నిదర్శనం. టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను గెలిపించి పెట్టాడు. ఆ తర్వాత అదే టీమిండియాను ఓడించి వన్డే వరల్డ్ కప్ నూ గెలిపించటం ద్వారా కంగారూలను విశ్వవిజేతలుగా నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్ లో కెప్టెన్ గా ఆడిన మొదటి సీజన్ లోనే తన టీమ్ ను ఫైనల్ కు చేర్చాడు. గతేడాది ఐపీఎల్ లో సీజన్ లో టేబుల్ లో చివరిస్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎవరి ఊహకు అందని రీతిలో చెలరేగిపోయింది. ఓపెనర్లు హెడ్, అభిషేశర్మ, మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ ల బ్యాటింగ్...నితీశ్, షాబాజ్ అహ్మద్ లాంటి ఆల్ రౌండర్ల ప్రతిభ..నట్టూ,భువీ, ప్యాటీ బౌలింగ్ భారాన్ని మోయటం అన్నీ కలిసొచ్చాయి సన్ రైజర్స్. 20 కోట్లు పెట్టిన కొనుక్కున్న కెప్టెన్ కమిన్స్ తన ధరకు వంద శాతం న్యాయం చేసేలా ఆరెంజ్ ఆర్మీని ఫైనల్ కి చేర్చి పూర్తి న్యాయం చేశాడు. ఇక ఆ ఉన్న ఒక్క అడుగు కూడా విజయవంతంగా పూర్తి చేస్తే తెలుగు టీమ్ కి ఐపీఎల్ కప్పు అందించిన మూడో ఆస్ట్రేలియన్ గా నిలుస్తాడు. అవును నిజం 2009లో డెక్కన్ ఛార్జర్స్ ను విజేతగా నిలిపిన గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. తర్వాత 2016లో ఐపీఎల్ విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ ను నిలిపిన వార్నర్ మోవ కూడా ఆసీస్ ఆటగాడే..ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా ఫైనల్లో SRH ను గెలిపిస్తే ఈ ఘనత అందుకున్న మూడో ఆస్ట్రేలియన్ అవుతాడు. తెలుగు టీమ్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాడు. పనిలో పనిగా ఏడాదిన్నర కాలంలో ప్రపంచ క్రికెట్ లో ఉన్న మూడు అత్త్యుత్తమ ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్ గా నూ నిలిచిపోతాడు ప్యాట్ కమిన్స్