SRH vs RR Qualifier 2 Spin Bowling | స్పిన్ మిషన్ లో పెట్టి రాజస్థాన్ రసం పిండేసిన ఆరెంజ్ ఆర్మీ |ABP

 ఐపీఎల్ లో ఫైనల్ ఆడాలంటే..తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్ లో చెలరేగిపోయింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ లో పేసర్లు హైదరాబాద్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే..ఇన్నింగ్స్ మారేసరికి పిచ్ కథ మారిపోయింది. పూర్తిగా స్పిన్నర్లకు టర్న్ అవుతున్న పిచ్ లో SRH స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ తోడుగా అభిషేక్ శర్మ జత కలవటంతో రాజస్థాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. 176పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పింక్ పాంథర్స్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని 139పరుగులకే పరిమితమైపోయారు. స్పిన్నర్లు ఎంటర్ అయ్యే వరకూ స్వేచ్ఛగా ఆడేసిన యశస్వి జైశ్వాల్ ను షాబాజ్ అహ్మద్ దొరకబుచ్చుకోవటంతో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత ఆగలేదు. జైశ్వాల్ తో పాటు రియాన్ పరాగ్, రవి చంద్ర అశ్విన్ వికెట్లను షాబాజ్ అహ్మదే తీసుకున్నాడు. మరో వైపు బ్యాటింగ్ లో విఫలమైనా ఈసారి బౌలింగ్ లో అండగా నిలబడి అచ్చం యువీని గుర్తు తెచ్చాడు అభిషేక్ శర్మ. కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ తీయటంతో పాటు ప్రమాదకర ఆటగాడు షిమ్రోన్ హెట్మెయర్ ను బౌల్డ్ చేయటం ద్వారా మ్యాచ్ ను హైదరాబాద్ చేతుల్లోకి తీసుకువచ్చేశాడు. ఇక ఫైనల్లో కోల్ కతా మీద ఇదే చెన్నై చెపాక్ లో తుదిపోరుకు సిద్ధం కానుంది సన్ రైజర్స్ హైదరాబాద్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola