KKR vs SRH IPL 2024 Final | ఐపీఎల్ ఫైనల్లో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా.? | ABP Desam

Continues below advertisement

 రాజస్థాన్ రాయల్స్ పై విక్టరీ కొట్టడం ద్వారా ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైపోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఈ రెండు టీమ్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ ఫైనల్ వల్ల టీమిండియాకు ఒరిగే ప్రయోజనం ఏం ఉండదు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ ను వరల్డ్ కప్ కి ముందు  ప్రాక్టీస్ గా మార్చుకోవటానికి టీ20 వరల్డ్ కప్ లో ఆడే ఏ ఇండియన్ ప్లేయరూ ఈ రెండు టీమ్స్ లో లేకపోవటమే ఇక్కడ విషయం. అవును టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన భారత జట్టులో కేవలం రెండు టీమ్స్ నుంచి మాత్రమే ప్లేయర్లు లేరు. ఆ టీమ్సే కోల్ కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఆ రెండు టీమ్సే ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నాయి. ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్ స్టర్స్ మంచి ప్రదర్శనే ఇచ్చినా వారు ఇంకా యంగ్ స్టర్స్ కావటం, ప్లేస్మెంట్స్ సమస్య, పైగా వాళ్లు కూడా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉండటంతో సెలెక్షన్ లో పరిగణలోకి తీసుకోలేదు. మరో టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి ఇదే జరిగింది. శ్రేయస్ అయ్యర్ సెలక్షన్ లో ఉంటాడని అందరూ భావించినా అంతకు ముందు టీమిండియా ఆడిన ఇంగ్లండ్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగటం..సెలెక్షన్స్ లో ఉండాలంటే రంజీ ఆడాలని బీసీసీఐ సూచించినా అయ్యర్ లైట్ తీసుకున్నాడు. దీంతో బీసీసీఐ అయ్యర్ పై క్రమశిక్షణా చర్యల కింద కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది. ఫలితంగా టీ20 వరల్డ్ కప్ టీమ్స్ ప్రాబబుల్స్ లోనూ అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు. రింకూ సింగ్ టీ20 వరల్డ్ కప్ లో  ఉన్నప్పటికీ అతడు కేవలం ట్రావెలింగ్ రిజర్వ్ గా టీమ్ తో పాటు ఉంటాడు తప్ప మ్యాచ్ లు ఆడడు. సో ఈ ఐపీఎల్ లో ఫైనల్ ప్యాట్ కమిన్స్, స్టార్క్, హెడ్ లాంటి ఆస్ట్రేలియన్లకు  క్లాసెన్, మార్ క్రమ్ లాంటి సౌతాఫ్రికా ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లా ఉపయోగపడుతుంది తప్ప టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ కు ఒరిగేది మాత్రం సున్నా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram