KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABP
క్రికెట్ ఈజ్ టర్నింగ్ ఇన్ టూ బేస్ బాల్. ఈ మాట అన్నది ఎవరో కాదు కోల్ కతా ఇచ్చిన 262పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 8బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కరన్. సంచలన ఛేజింగ్ ప్రపంచ టీ20 చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన తర్వాత శామ్ కరన్ ఈ మాట మాట్లాడాడు అది కూడా కెప్టెన్ గా ఉండి. దీన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.