KKR Captain Shreyas Iyer Won IPL 2024 | కేకేఆర్ కు మూడో కప్ గెలిపించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ | ABP

Continues below advertisement

ఏ హడావిడి లేకుండా..ఏ ఆర్భాటమూ లేకుండా చాలా కామ్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కి ఐపీఎల్ అందించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గాయం కారణంగా లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ నితీశ్ రాణా చేస్తే ఈ ఏడాది మళ్లీ కెప్టెన్ గా తిరిగి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. అయితే రావటానికి ముందు అతని క్రికెటింగ్ కెరీర్ ను ఇంపాక్ట్ చేసే ఘటన ఒకటి జరిగింది. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా లాస్ట్ టెస్ట్ ఆడలేనని చెప్పాడు. బీసీసీఐ కూడా అందుకు అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాతి టెస్ట్ కి కూడా అయ్యర్ అందుబాటులోకి రాలేదు. అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్ కి బీసీసీఐ ఓ అల్టిమేటం ఇచ్చింది. మీరు టీమిండియాకు మళ్లీ సెలెక్ట్ కావాలాన్నా మ్యాచులు ఆడాలన్నా రంజీలు ఆడాలని సూచించింది. కానీ ఆ ఇద్దరూ పట్టించుకోలేదు. అయ్యర్ కాస్త ఆలస్యంగా రంజీ ఆడేందుకు అంగీకరించాడు. ముంబై తరపున తమిళనాడుతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు పేరు ఇచ్చాడు. కానీ ఈ లోపే బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram