Kavya Maran Celebrations SRH in IPL 2024 Final | ఎండింగ్ లో ఎమోషనల్ గా మారిన RR vs SRH మ్యాచ్

 క్రికెట్ అంటేనే అంత ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. నిన్న రాజస్థాన్ రాయల్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ అంతే. టార్గెట్ 300 అన్నట్లు బరిలోకి దిగిన సన్ రైజర్స్ 175పరుగులే చేసినప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. రాజస్థాన్ రాయల్స్ మీద ఈ టార్గెట్ ను డిఫెండ్ చేసుకోగలమా అనే సందేహమే అందరిలోనూ ఎందుకంటే రాజస్థాన్ కు బలమైన లైనప్ ఉంది. మరీ అంత సూపర్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా అందరూ నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించిన వాళ్లే. అయితే ఆరెంజ్ ఆర్మీ టెన్షన్ ను తీర్చేలా హైదరాబాద్ స్పిన్నర్లు RR ను ఉచ్చులో బిగించేశారు. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ పోటీపడి మరీ వికెట్లు తీయటంతో ఈజీగా ఛేజ్ చేసేస్తుంది అనిపించిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా కుప్పకూలి 139పరుగులే చేయగలిగింది. ఆ టైమ్ లో రెండు వైపులా రెండు ఎమోషన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ఫుల్ ఎంజాయ్ చేశారు విక్టరీని. అప్పటి వరకూ పడిన టెన్షన్ ని వదిలేసి నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ తన తండ్రి కళానిధి మారన్ ను హగ్ చేసుకుంటూ రకరకాల ఎమోషన్స్ ను చూపించారు. మరోవైపు ఈ పాప చూడండి. రాజస్థాన గెలుస్తుందని బలంగా నమ్మిందేమో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే కనిపించింది ఫైనల్ ఓవర్ అంతా. మ్యాచ్ అంటేనే అంతగా ఓ టీమ్ కి సెలబ్రేషన్ మరో టీమ్ కి మర్చిపోలేని ఎమోషన్. మొత్తంగా ఫైనల్ కి ముందు జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్ ఇన్ని ఎమోషన్స్ బయటపడేలా చేసిందన్నమాట.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola