Karun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

Continues below advertisement

 మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ నమోదు చేస్తూ 22 బాల్స్ లోనే అర్థశతకాన్ని పూర్తి చేశాడు. ఈ ప్రాసెస్ లో ముంబై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాతో గొడవైంది కరుణ్ నాయర్ కి. ఇన్నింగ్స్ 6వ ఓవర్ లో తన రెండో ఓవర్ వేయటానికి బుమ్రా వచ్చాడు.  అయితే బుమ్రాను లెక్కపెట్టకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు కరుణ్ నాయర్. వరుసగా రెండు బంతులను రెండు సిక్సులు కొట్టిన కరుణ్ నాయర్..మరో బంతిని బౌండరీకి తరలించాడు. ఇక అదే ఓవర్ ఆఖర్లో డబుల్ తీసేందుకు ప్రయత్నించిన కరుణ్ నాయర్..పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజు దగ్గర ఉన్న జస్ ప్రీత్ బుమ్రాను గట్టిగా ఢీకొట్టాడు. వాస్తవానికి కరుణ్ నాయర్ చూసుకోకుండా తగిలాడనే విషయం రీప్లైస్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతున్నా బుమ్రా మాత్రం గొడవకు దిగాడు. కరుణ్ నాయర్ ను తిడుతూ హేళన చేశాడు. దీనిపై ఒళ్లు మండిన కరుణ్ నాయర్ అంపైర్ , ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇదే విషయమే సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు అంతగా పట్టించుకోలేదు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలోనూ కరుణ్ నాయర్ తో గొడవ పడుతూనే కనిపించాడు బుమ్రా. వీళ్లిద్దరూ ఇంత గొడవపడుతుంటే పెద్ద మనిషిగా తీర్పు చెప్పాల్సిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటో తెలుసా. వాళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు గా కొట్టుకోనివ్వండి అంటూ శకుని మామ పాత్రలో కనిపించాడు రోహిత్ శర్మ. మీరూ మీరూ కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అన్నట్లు కొంటెంగా నవ్వుతూ కళ్లెగరేస్తూ కనిపించాడు . మ్యాచ్ పూర్తైంది ముంబై మ్యాచ్ గెలిచింది బుమ్రా మాత్రం ఇష్యూను వదిలిపెట్టలేదు. మ్యాచ్ పూర్తైన తర్వాత కరుణ్ నాయర్ తో మాట్లాడుతూ మళ్లీ అదే కన్వే చేసే ప్రయత్నం చేశాడు బుమ్రా. సో అలా ఎడతెగని వివాదంలా సాగిందన్నమాట ఇష్యూ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola