Karun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

Continues below advertisement

 నిన్న కరుణ్ నాయర్ ఢిల్లీని ఏం గెలిపించలేదు. సెంచరీలు చేసి సంబరాలు చేసుకోలేదు. జస్ట్ ఆడాడు అంతే. ఆ ఆట ఎలాంటిది అంటే...ప్రత్యర్థి టీమ్ లో ఈడు తోపు బౌలర్ రా వాడిని జాగ్రత్తగా ఆడుకోవాలి అనుకుంటాం చూడు. వాడినే టార్గెట్ చేసే ఆడాడు. వీడి బౌలింగ్ కి ప్రపంచంలో ఎవడైనా భయపడాల్సిందనే రేంజ్ బౌలర్ ఉంటాడు వాడిని ఊతకొట్టుడు కొట్టాడు. ఎందుకంత కసి అంటే. తన జర్నీ మాములుది కాదు. ఇప్పుడు కరుణ్ నాయర్ వయస్సు 32ఏళ్లు అంటే జనరల్ గా క్రికెట్ లో రిటెర్మైంట్ కోసం ఆలోచించే వయస్సు. కానీ కరుణ్ జట్టులో ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 2016లో ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీ బాది..వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచిన కరుణ్ నాయర్..ఆ తర్వాత మెల్లగా టీమ్ లో స్థానాన్నే కోల్పోయాడు.  2022 లో ఆఖరి సారి ఐపీఎల్ లో కనిపించిన కరుణ్ నాయర్ మూడేళ్లుగా ఐపీఎల్ లో ఆడింది లేదు. రంజీ ట్రోఫీలు, విజయ్ హజారే ట్రోఫీల్లో వందలకు వందలు పరుగులు చేస్తున్నా ఆ ఒక్క ఛాన్స్ మాత్రం మళ్లీ రాలేదు కరుణ్ నాయర్ కు. ఈ ట్వీట్ చూడండి. 2022లో రాసుుకన్నాడు. డియర్ క్రికెట్ ఇంకొక్క ఛాన్స్ ప్లీజ్..ప్రూవ్ చేసుకుంటా అని. అక్కడితో ఆగిపోలేదు అవకాశాలు రాకపోయినా సొంత టీమ్ కర్ణాటక మాకు అక్కర్లేదు అని పక్కకు పడేసినా భయపడిపోలేదు. ఆట వదిలేసి పారిపోలేదు. విదర్భ జట్టుకు మారాడు. గడచిన రెండేళ్లుగా దేశవాళీల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అయినా జాతీయ జట్టుకు పిలుపు రాలేదు. ఇక ఉన్నది ఒకే ఒక్కఆశ. ఐ పీఎల్. అదృష్టం కొద్దీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 50 లక్షల రూపాయలకు కరుణ్ నాయర్ కు కొనుక్కుంది. ఎందుకు కేవలం అంటున్నా అంటే 2018లో అతని రేట్ ఐదు కోట్ల 60 లక్షలు కాబట్టి. సరే ఛాన్స్ వచ్చినా నాలుగు మ్యాచులుగా ఆడటానికి చోటు లేదు. కానీ ఈ రోజు మ్యాచ్ లో ఫాప్ డుప్లెసీ గాయం కారంణంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దొరికిన బౌలర్ ను దొరికినట్లు వాడు బుమ్రానా..బౌల్టా అని చూడకుండా విరుచుకుపడిపోయాడు. మ్యాచ్ ఆడటంతోనే సగం జీవితం గెలిచిన కరుణ్...40 బాల్స్ లోనే 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగులు చేసి ది గ్రెటెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఏకంగా 222 స్ట్రైక్ రేట్తో ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. పొరపాటున సెంచరీ మిస్సయ్యాడు కానీ లేదంటే కరుణ్ నాయర్ చూపిస్తున్న దూకుడుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవటం అనేది జరిగి ఉండేది కాదు. మొత్తంగా ఓటమిని ఒప్పుకోకుండా ఓర్పుతో ఎదురు చూస్తూ తన ప్రతిభను మరింతగా సానపట్టుకుంటూ అవకాశం దొరకగానే తనను ప్రూవ్ చేసుకున్న తీరుతో కరుణ్ నాయర్ జెర్సీ సినిమాలో నాని ట్రైన్ దగ్గర అరిచిన అరుపు కంటే పెద్దగానే అరిచాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola