Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam

గువాహటి వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రవీంద్ర జడేజా. ఇన్నాళ్లూ చెన్నైకి ఆడిన జడ్డూ, ఇప్పుడు అదే జట్టు ఓటమికి కారణం అవడంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, రాజస్థాన్ పేసర్లు ఆర్చర్, బర్గర్ ధాటికి పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ చెన్నైని ఆదుకునే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్, జడేజాను రంగంలోకి దించాడు. ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికే సర్ఫరాజ్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన జడ్డూ, అదే ఓవర్ ఆఖరి బంతికి శివమ్ దూబేను కూడా పెవిలియన్ పంపాడు.

ఒకే ఓవర్‌లో ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేయడంతో చెన్నై కోలుకోలేకపోయింది. ముఖ్యంగా దూబే వికెట్ తీసిన తర్వాత జడేజా పిస్టోల్ పేల్చినట్టు చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola