IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam

ఐపీఎల్ 2026 సీజ‌న్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద్భుతంగా ప్రారంభించింది. అన్ని విభాగాల్లో రాణించిన రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీని త‌న సొంతం చేసుకుంది. ముఖ్యంగా వైభ‌వ్ సూర్య‌వంశీ ఫిప్టీతో చెల‌రేగ‌డంతో చిన్న టార్గెట్ ను ఉఫ్ మ‌ని ఊదేసింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట‌ర్ల వైఫ‌ల్యంతో 19.4 ఓవ‌ర్లలోనే 124 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

ఆల్ రౌండ‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ 43 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ర‌వీంద్ర జ‌డేజా, నాండ్రే బ‌ర్గ‌ర్, జోఫ్రా ఆర్చ‌ర్ ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. ఈ టార్గెట్ ను కేవ‌లం 12.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 128 ప‌రుగులు చేసి ఈజీ గెలుపును సొంతం చేసుకుంది RR. 

చిన్న టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ కు వైభ‌వ్ సూర్యవంశీ తుఫానీ ఆరంభం అందించాడు. 4 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో చెల‌రేగిపోయాడు. కేవ‌లం 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఒక ఎండ్ లో చెన్నై బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి నానా తంటాలు ప‌డిన చోట‌, వైభ‌వ్ మాత్రం ఈజీగా ప‌రుగులు సాధించాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే ఒక ఫోర్, సిక్స‌ర్ తో దాడి షురూ చేసిన వైభ‌వ్.. ఐదో ఓవ‌ర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్స‌ర్ తో రెచ్చిపోయాడు. 47 బంతులు మిగిలి ఉండ‌గానే రాజ‌స్థాన్ భారీ  విజ‌యం సాధించ‌డంతో మంచి నెట్ ర‌న్ రేట్ ను సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola