IPL 2024 WPL 2024 Same to Same | ఐపీఎల్, డబ్య్లూపీఎల్ రెండు ఫైనళ్లూ అచ్చం ఒకేలా | ABP Desam

  ఐపీఎల్, డబ్ల్యూ పీఎల్ రెండూ స్క్రిప్టెడ్. అచ్చం రాసినట్లుగానే ఆడారు. కప్పు గెలిచారు. ఇదేదో ఐపీఎల్ క్రికెట్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేయటానికి అంటున్న మాటలు కావు. సంచలన ఆధారాలు ఉన్నాయి చూసి మీరే చెప్పండి. ఇంత కో ఇన్సిడెన్స్ ఎలానో. ఈ ఐపీఎల్ కి ముందు అమ్మాయిల ఐపీఎల్ అదే విమెన్ ప్రీమియర్ లీగ్ WPL జరిగింది. ఆ టోర్నీలో ఫైనలిస్టులు ఎవరో చూడండి. డీసీ వర్సెస్ ఆర్సీబీ. డీసీ కి కెప్టెన్ ఆస్ట్రేలియన్ మెగ్ లానింగ్. ఆర్సీబీ కి కెప్టెన్ మన ఇండియన్ స్మృతి మంథానా. ఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సరిగ్గా 18.3ఓవర్లలో 113పరుగులు చేసింది. చిన్న స్కోరును ఫాస్ట్ గా ఛేజ్ చేసేసిన ఆర్సీబీ 8వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఆర్సీబీ కి కెప్టెన్సీ చేస్తున్న స్మృతి మంథాననే డబ్ల్యూ పీఎల్ కప్ గెల్చుకుని ముద్దాడింది. ఇప్పుడు నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ చూడండి. KKR vs SRH. సన్ రైజర్స్ కి కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా ఆటగాడు. కేకేఆర్ కి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత ఆటగాడు. ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కూడా సరిగ్గా 18.3 ఓవర్లే ఆడి 113 పరుగులు చేశారు. అదేంటో ఛేజింగ్ కి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కూడా సరిగ్గా 8వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సారి కూడా కప్ ను ముద్దాడింది ఇండియన్ ఆటగాడు శ్రేయస్ అయ్యరే. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola