Dewald Brevis Out DRS Controversy | IPL 2025 లో వివాదాస్పదంగా మారుతున్న అంపైర్ల నిర్ణయాలు | ABP Desam
చెన్నై ఆర్సీబీ మీద మ్యాచ్ గెలవాలంటే 22 బాల్స్ లో 44 పరుగులు చేయాలి. అప్పటి వరకూ జోరు చూపించిన ఆయుష్ మాత్రే అవుట్ అవ్వటంతో డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు. ఆర్సీబీ బౌలర్ లుంగీ ఎన్గిడి బౌలింగ్ లో తను ఎదుర్కొన్న తొలి బంతినే కంప్లీట్ గా మిస్ అయ్యాడు డెవాల్డ్ బ్రెవిస్ . ఆర్సీబీ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసింది. అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇది గమనించని బ్రెవిస్ ఛాన్స్ ఉంది కదా అని సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత బాల్ స్టంప్స్ కి తగలి పక్కకి వెళ్లే మళ్లీ మరో సింగిల్ తిరిగాడు. అప్పుడు జడేజా చూశాడు బ్రెవిస్ ని అంపైర్ అవుట్ అని ప్రకటించాడని. ఇక్కడ డెవాల్డ్ బ్రెవిస్ తప్పు కూడా ఉంది. అంపైర్ ఏం సిగ్నల్ ఇచ్చారని పట్టించుకోకపోవటం. కానీ అంపైర్ డెసిషన్ ని రివ్యూ చేసుకునే టైమర్ ఏదీ స్క్రీన్ మనకు కనపడలేదు ఆ టైమ్ లో. అంపైర్ అవుట్ ఇచ్చేశాడు అంతే. బ్రెవిస్ , జడేజా రెండు పరుగులు తీసుకుని తర్వాత ఐదు సెకన్లు మాట్లాడుకుని మొత్తం అంపైర్ అవుట్ ఇచ్చిన 25 సెకన్ల తర్వాత డీఆర్ఎస్ అడిగారు. అంపైర్ ఇంకెక్కడ డీఆర్ఎస్ మీరు 15 సెకన్లలోపే తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టి నా డెసిషనే ఫైనల్ నువ్వు ఔట్ అంటూ డెవాల్డ్ బ్రెవిస్ ని ఔట్ గా ప్రకటించారు. కీలక సమయంలో మ్యాచ్ ఇక్కడే స్లో డౌన్ అయిపోయింది. అసలు అది రీ ప్లేలో చూస్తే కంప్లీట్ వికెట్స్ ను మిస్సయ్యింది లెగ్ స్టంప్ దాటి బయటకు వెళ్తోంది కంప్లీట్ గా నాట్ అవుట్ అది. డీఆర్ఎస్ తీసుకుని ఉంటే బ్రెవిస్ బతికేవాడు చెన్నై స్కోరును ఛేజ్ చేసేసేది కావొచ్చు. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించటం ఓ తప్పైతే..మరొకటి అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోకపోవటం బ్రెవిస్ తప్పు...డీఆర్ఎస్ టైమర్ బిగ్ స్క్రీన్ మీద వేయకపోవటం టెక్నికల్ మిస్టేక్ అయితే...25 సెకన్ల తర్వాత రివ్యూ అడిగినా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయకుండా రూల్ ప్రకారమే అంపైర్ స్ట్రిక్ గా ఉండటం నాలుగో విషయం. ఇలా ఇన్ని విషయాలు కలగలిసి డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడి వికెట్ ను బలి తీసుకున్నాయి. కానీ ఈ సీజన్ లో అంపైర్ల నిర్ణయాలపై మాత్రం భారీ స్థాయిలో నెగటివిటీ వస్తోంది. ఇదే అంపైర్లు మొన్న రోహిత్ శర్మ టైమర్ పై టైమ్ సున్నా కి వచ్చేసినా డీఆర్ఎస్ కి అనుమతించారు. ఇప్పుడు బాల్ కి లైవ్ లో ఉన్నప్పుడే డీఆర్ఎస్ తీసుకోలేదని చెప్పటం..అవుట్ గా ప్రకటించాక బాల్ లైవ్ లో ఉండదని ఆర్గ్యూ చేయటం ఉఫ్..రూల్స్ తో రఫ్పాడిస్తున్నారు. ఆటగాళ్లతో పొలికేకలు పెట్టిస్తున్నారు అంపైర్లు