Dewald Brevis 30 Runs Urvil Patel Hitting | KKR vs CSK మ్యాచ్ లో ఉర్విల్, బ్రేవిస్ మెరుపు దెబ్బ
ఈ సీజన్ లో ఇప్పటికే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సీఎస్కే గతనా లుగైదు మ్యాచుల నుంచి వచ్చే ఏడాది కోసం తన టీమ్ ను సెట్ చేసుకునే పనిలో ఉంది. నిన్న మొన్నటి వరకూ సీఎస్కే ని అందరూ డాడీస్ ఆర్మీ అని పిలిచేవాళ్లు. కానీ ఈ సీజన్ లో అంతా మారిపోయింది. కెప్టెన్ గా MS ధోని వచ్చిన తర్వాత వచ్చే రెండు మూడేళ్లకు టీమ్ ను తయారు చేయటం మొదలుపెట్టాడు. ఓపెనర్లుగా ఆయుష్ మాత్రే, షేక్ రషీద్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చిన ధోనీ..డెవాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఆర్డర్..ఫినిషర్ రోల్ కి రెడీ చేస్తున్నాడు. నిన్న ఉర్విల్ పటేల్ అనే కొత్త ఆటగాడికి ఛాన్స్ ఇచ్చారు సీఎస్కే మేనేజ్మెంట్. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 28 బంతుల్లో సెంచరీ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఉర్విల్..నిన్న సీఎఎస్కే తరపున తొలి మ్యాచ్ ఆడి అందులోనే రాణించాడు. 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు ఉర్విల్ పటేల్. ఆ తర్వాత బేబీ ఏబీగా పిచుకునే డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ అరోరా వేసిన ఒక్కఓవర్ లోనే మూడు సిక్సులు, మూడు ఫోర్లతో 30 పరుగులు రాబట్టిన బ్రేవిస్...మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయటంతో పాటు 25 బంతుల్లోనే 4ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి..చెన్నైను విన్నింగ్ ట్రాక్ ఎక్కించాడు. ఇంకా వీళ్లు కాకుండా అన్షుల్ కాంభోజ్, పతిరానా, నూర్ అహ్మద్ లాంటి కుర్రాళ్లతో కళకళాలాడిపోతున్న చెన్నె వచ్చే ఏడాదికి చాలా స్ట్రాంగ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.