Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam

Continues below advertisement

   చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను చెరో 14 కోట్లకు కొనుక్కుని ఆశ్చర్యపరిస్తే...ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ బైతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. తనే అఖీబ్ నబీ. 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ ఉన్న జమ్ము కశ్మీర్ కు చెందిన ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ 8కోట్ల 40 లక్షల రూపాయలను ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఖర్చు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నబీని దక్కించుకోవటం కోసం ఢిల్లీ, రాజస్థాన్, ఆర్సీబీ, సన్ రైజర్స్ పోటీ పడ్డాయి. ఫలితంగా అతని ధర అమాంతం ఆకాశానికి వెళ్లిపోయింది. 29ఏళ్ల నబీ ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున ఆడుతూ నాలుగు వికెట్లు తీశాడు. అందులో కింగ్ విరాట్ కొహ్లీ వికెట్ కూడా ఉంది.  ఈ ఏడాది రంజీట్రోఫీలో టాప్ 5 వికెట్ టేకర్స్ లో ఒకడిగా నిలవటంతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 29 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. మూడు సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. జమ్ము కశ్మీర్ ను నాకౌట్ మ్యాచెస్ తీసుకెళ్లి ఐపీఎల్ స్కౌటింగ్ టీమ్స్ దృష్టిలో పడిన అఖీబ్ నబీని కశ్మీర్ లో అంతా జూనియర్ మహ్మద్ షమీ అని పిలుస్తారట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola