IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

ఆర్సీబీ దుమ్ము రేపింది. చిరకాల ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన‌ లీగ్ మ్యాచ్ లో 43 రన్స్ తో డిఫెండింగ్ చాంపియ‌న్స్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న‌విజ‌యం సాధించింది. అలాగే చెన్నైపై RCBకి వ‌రుస‌గా నాలుగో విజ‌యం కావ‌డం విశేషం.  

సొంత‌గ‌డ్డ చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన‌ ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 250 ప‌రుగులు చేసింది. ఈ సీజ‌న్ లో ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం విశేషం.  మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ సూప‌ర్బ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

అనంత‌రం ఛేజింగ్ లో సీఎస్కే 19.4 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసాడు. RCB బౌలర్లలో భువ‌నేశ్వ‌ర కుమార్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. 19 ఏళ్ల ఐపీఎల్ సీజ‌న్లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక స్కోరును స‌మ‌ర్పించుకున్న చెన్నై.. టార్గెట్ ఛేజింగ్ లోనూ అదే చెత్త ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. 

ఆరంభంలోనే సంజూ శాంస‌న్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. స‌ర్ఫ‌రాజ్ భారీ షాట్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. అత‌ని జోరుతో చెన్నై స్కోరు బోర్డు వేగంగానే సాగింది. కానీ వెంటనే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ప్ర‌శాంత్ వీర్, శివ‌మ్ దూబే ఆదుకుంటారు అనుకుంటే అది జరగలేదు. రన్ రేట్ కూడా భారీగా ఉండ‌టంతో సీఎస్కే నుంచి మ్యాచ్ చేజారి పోయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola