IPL 2026 MI vs GT Highlights | గుజ‌రాత్ ను చిత్తు చేసిన ముంబై

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ముంబై.. గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఊహించని ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ విధ్వంసంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. 

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ తొలి బంతికే సాయి సుదర్శన్‌ను డకౌట్ చేసాడు. ఆ తర్వాత  గుజరాత్ కోలుకోలేదు. అశ్వనీ కుమార్ తన స్పెల్‌తో అద్భుతం చేశాడు. గిల్, తెవాటియా వంటి వికెట్లు తీసి సత్తా చాటాడు. 

హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ కు ఇది ఘోర పరాజయం అనే చెప్పాలి. తిలక్ వర్మ సెంచరీ, అశ్వనీ కుమార్ బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని అందుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola