IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం

ఐపీఎల్ 2026వ సీజ‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ దూకుడు కొన‌సాగుతోంది. వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాల‌ను సాధించింది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై 5 వికెట్ల‌తో విజ‌యం అందుకుంది. టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవ‌ర్ల‌లో 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆల్ రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 79 పరుగులు చేసి విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. కెప్టెన్ రహానే డక్ అవుట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ తప్పా మిగితా ప్లేయర్స్ అంతగా రాణించలేదు. 

ఇక చేజింగ్ కు దిగిన గుజ‌రాత్ 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 181 ప‌రుగులు చేసి మ్యాచ్ గెలిచింది. శుభ‌మాన్ గిల్ 50 బంతుల్లో 86 పరుగులు చేసి త్రుటిలో సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఓపెన‌ర్లు గిల్, సాయి సుద‌ర్శ‌న్ ఓవ‌ర్ కు ప‌ది ప‌రుగుల‌కు పైగా ర‌న్ రేట్ ప‌రుగులు సాధించ‌డంతో, స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. గిల్.. జోస్ బ‌ట్ల‌ర్ తో క‌లిసి ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించాడు. వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై దూకుడుగా ఆడి, ఒత్తిడి పెంచారు. 

గిల్ ఔట‌య్యే స‌మ‌యానికి టార్గెట్ కూడా తక్కువ అయిపోయింది. దీంతో గిల్ ఔటైన‌ప్ప‌టికీ, మిగ‌తా బ్యాట‌ర్లు ఈజీగా టార్గెట్ ను చేజ్ చేసారు, ఓపెనర్లు బాగా స్కోర్ చేయడంతో.. వికెట్స్ పడినా కూడా గుజరాత్ టార్గెట్ ను చేజ్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola