IPL-14,CSK vs PBKS: చెన్నైపై గెలిచి గౌరవంగా వెళ్లాలనుకుంటున్న పంజాబ్ !

Continues below advertisement

ఐపిఎల్ 14 లో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యే సమయం వచ్చింది. ప్రతి జట్టు వారి చివరి మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ  సందర్భంగా ఇవాళ జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇవాళ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎటువంటి ఇబ్బంది లేదు. చెన్నై పాయింట్స్ టేబుల్ లో రెండవ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ రోజు గెలిస్తే మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. పంజాబ్ గెలిచినా ఓడినా ఒకటే పరిస్థితి. కానీ పంజాబ్ గెలిస్తే గెలుపుతో లీగ్ ని ముగించిన సంతృప్తి వాళ్ళకి వస్తుంది. చెన్నై కూడా గెలుపుతో ప్లే ఆఫ్స్ కి చేరుకోవడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఎవరు గెలుస్తారో, ఎవరు ఒడిపోతారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram