Indian boys start with a win: అండర్-19 ప్రపంచకప్ లో భారత్ బోణీ

అండర్-19 ప్రపంచకప్ లో భారత్ కుర్రాళ్లు బోణీ కొట్టారు. తమ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టిన భారత్... 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా... యష్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో 232 పరుగుల ఓ మోస్తరు స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన యువ సఫారీలు 187 పరుగులకే ఆలౌట్ అయ్యారు. విక్కీ ఓస్త్వాల్ అనే ఎడమ చేతి వాటం స్పిన్నర్ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జనవరి 19న తన తర్వాతి మ్యాచ్ లో ఇర్లాండ్ ను భారత్ ఢీ కొట్టబోతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola