India vs West Indies Test Match Record Breaking Centuries | ఆహ్మదాబాద్ టెస్ట్‌పై పట్టుబిగించిన భారత్
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా వెస్టిండీస్ పై ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో చెలరేగారు.
ఓవర్ నైట్ స్కోరు 76తో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్.. తన కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ధ్రువ్ జురెల్ సెంచరీతో తన సత్తా చాటాడు. అయితే ధ్రువ్ జురెల్ సెలెబ్రేట్ చేసిన తీరు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. జురెల్ తండ్రి ఒక ఆర్మీ అధికారి. సో సెంచరీ చేసిన తర్వాత గన్ సెల్యూట్ చేసాడు ఈ యంగ్ ప్లేయర్.
టెస్టుల్లో నంబర్ వన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీ చేసి రికార్డులను బ్రేక్ చేసాడు. కత్తి తిప్పినట్లుగా బ్యాట్ తిప్పుతూ ఫ్యాన్స్‌ను అలరించాడు జడ్డు భాయ్. టీమ్ ఇండియా ప్లేయర్స్ ఆడుతున్న తీరుతో విండీస్ బౌలర్లు సతమతమవుతున్నారు. వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ మనవాళ్లు మాత్రం ఎక్కడా తగ్గకుండా చెలరేగుతున్నారు.