Ravindra Jadeja Record India vs West Indies | టెస్టుల్లో జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌

ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట‌ర్ల‌లో ధోనీ స‌ర‌స‌న జ‌డ్డూ చేరాడు. అహ్మ‌దాబాద్ లో జ‌రుగుతున్న తొలి టెస్టులో 5 సిక్స‌ర్లు కొట్టిన జ‌డేజా.. త‌న కెరీర్లో 78వ సిక్స‌ర్ ను కొట్టాడు. ఈ మ్యాచ్ లో జ‌డేజా సెంచ‌రీతో స‌త్తా చాటాడు. ఈ ఒక్క సెంచరీతో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. 

టెస్టుల్లో నెంబర్ 5 కంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ జడ్డూ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరు మీద ఉండేది. జడేజా తన 28వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా.. ఎంఎస్ ధోనీని అధిగమించాడు. జడేజా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమాయనికి 79 సిక్స్‌లు కొట్టాడు. ధోనీతన కెరీర్‌లో 78 సిక్స్‌లు కొట్టాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola