India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గాయపడడంతో కెప్టెన్ శుబ్మన్ గిల్ రెండవ టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రిషభ్ పంత్.. తొలిసారి బరిలోకి దిగనున్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే.. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
శుభ్‌మన్ గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. సుదర్శన్ మూడో ప్లేసులో.. ధ్రువ్ జురెల్ నాలుగో స్థానంలోకి బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు వస్తారు.
అయితే మొదటి మ్యాచ్ కు దూరమైన నితీశ్ కుమార్ రెడ్డి.. రెండో టెస్టులో ఆడే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ప్లేస్ లో నితీశ్ రెడ్డి ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. చూడాలి మరి టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో.