India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?

Continues below advertisement

ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ టీ20 నేడు జరగనుంది. టీమిండియాకు ఫస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 182 రన్స్ ఛేజింగ్‌లో మన టాప్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అవ్వడంతో 148 రన్స్‌కే ఆలౌట్ అయ్యాం. కంబ్యాక్ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది బ్యాడ్ స్టార్ట్. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఉన్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని ఇండియా కసితో ఉంది.

తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సింగిల్ డిజిట్‌కే అవుట్ అవ్వడం మేనేజ్‌మెంట్‌ను టెన్షన్ పెడుతోంది. అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేసినా సపోర్ట్ దక్కలేదు. ఐరిష్ డెబ్యూ పేసర్లు ముంద్రా, హాలర్డ్ మన బ్యాటింగ్‌ ఆర్డర్ ను ముక్కలు చేశారు.
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై సస్పెన్స్ వీడింది. ఒక్క ఓటమితోనే టాప్ ఆర్డర్‌ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, కోచ్ అండ్ కెప్టెన్ సేమ్ టీమ్‌తోనే వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి వైభవ్ ఈ మ్యాచ్‌లోనూ బెంచ్ కే పరిమితం కానున్నాడు.

బౌలింగ్‌లో హర్షిత్ రాణా 3 వికెట్లతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చినా.. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హిస్టారికల్ విక్టరీతో ఐర్లాండ్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. మరి ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కాపాడుకుంటుందో లేదో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola