India Vs Hongkong : హాంగ్ కాంగ్ పై అదిరే విజయం సాధించిన టీం ఇండియా | ABP Desam
హాంగ్ కాంగ్ పై 40 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు డిసెంట్ గానే మ్యాచ్ ను ప్రారంభించారు. నెమ్మదిగా స్కోరు బోర్డు కదలించారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్ తో 28 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో సూర్యకుమార్ హిట్టింగ్ నెక్స్ట్ లెవల్. నాలుగు సిక్సర్లు, రెండు పరుగులతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో.. 192 పరుగుల భారీ స్కోరును హాంగ్ కాంగ్ ముందు ఉంచారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ కు ఓపెనింగ్ శుభారంభం దక్కలేదు. అలా.. చివరకు హంగ్ కాంగ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఈ విజయంతో టీం ఇండియా సూపర్-4 లోకి అడుగుపెట్టింది.