India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
ఆసియాకప్ 2025లో ఆసక్తికర మ్యాచ్ చోటుచేసుకోనుంది. బంగ్లాదేశ్ తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియాకు దాదాపుగా ఫైనల్ బెర్త్ దక్కుతుంది. మరోవైపు సూపర్-4లో శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లా.. ఉత్సాహంతో ఉంది. భారత్ పై అదే తరహా ప్రదర్శనతో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడనుండి.
ఆసియా కప్ లో టీమ్ ఇండియా ... బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బాగానే ప్రదర్శిస్తున్నారు. ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతోంది. బ్యాటింగ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోతున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ లతో భారత మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి దుబాయ్ పిచ్ లపై బాగా బౌలింగ్ చేస్తున్నారు.
ఇక లీగ్ దశలో సాధారణ ప్రదర్శన చేసి బంగ్లా సూపర్ ఫోర్ చేరింది. తౌహిద్ , తంజిద్ హసన్ లాంటి యువకులు సత్తా చాటుతున్నారు. ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్ లు టీమ్ కు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ కు చేరినా, రన్నరప్ తోనే సరిపెట్టుకున్న బంగ్లా.. ఈసారైనా కప్పును ముద్దాడాలని భావిస్తోంది.