అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్
పింక్ బాల్ టెస్ట్‌పై ఇక ఇండియా ఆశలు వదులుకోక తప్పదేమో అనిపిస్తోంది. ఫస్ట్ టెస్ట్‌లో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్‌కి వచ్చే సరికి చతికిలపడింది. ఓడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. రెండో టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా డామినేషన్ కొనసాగింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... రెండో రోజు 337 రన్స్ చేసిన ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 140 రన్స్ చేసి స్కోర్‌ని భారీగా పెంచాడు. బుమ్రా నాలుగు, సిరాజ్ నాలుగు, అశ్విన్, నితీశ్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా ఆస్ట్రేలియా 157 రన్స్ లీడ్ సాధించుకుంది. ఆ తరవాత ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. విరాట్ కోహ్లి 11 పరుగులు, రోహిత్ శర్మ 6 పరుగులకే పరిమితమయ్యారు. యశస్వి జైస్వాల్ 24 పరుగులు, శుభ్‌మన్ గిల్ 28 పరుగులు చేశారు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 128 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న పంత్, నితీశ్‌పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే విధంగా ఆపసోపాలు పడుతోంది.