ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్

Continues below advertisement

బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. చివరి రోజు రెండు సెషన్ల ఆట సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ టెస్ట్ డ్రా అవడం వల్ల సిరీస్ ఆస్ట్రేలియా భారత్ 1-1 తో సమం చేశాయి. వర్షం కారణంగా చివరి సెషన్‌కి ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం కంటిన్యూ అయితే..డ్రాగా ప్రకటిస్తారని ముందుగానే అంతా ఓ అంచనాకి వచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే డ్రా అయినట్టు వెల్లడించారు. ఈ థర్డ్ టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆ తరవాత బరిలోకి దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసింది. ఆ తరవాత సెకండ్ ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా..డిక్లేర్ చేసింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. కేఎల్ రాహుల్, జైస్వాల్ క్రీజ్‌లోకి వచ్చారు. అయితే..8 పరుగులు చేసిన తరవాత వర్షం మొదలు కావడం వల్ల మ్యాచ్ ఆపేశారు. అప్పటి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురవడం వల్ల టెస్ట్ డ్రాగా ప్రకటించారు. కాగా..డిసెంబర్ 26వ తేదీన మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్ట్ జరగనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram