India Records in Asia Cup | రికార్డ్స్ తో భయపెడుతున్న భారత్
ఆసియా కప్ 2025 పై ఆసక్తి నెలకొంది. టీం ను ప్రకటించక ముందే ఎవరిని సెలెక్ట్ చేస్తారో అన్నది ఫ్యాన్స్ అంచనా వేయడం మొదలు పెట్టారు. అయితే టీం ను ప్రకటించిన తర్వాత సెలక్షన్ కమిటీపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా టీం ఇండియా ఈ సంవత్సరం జరిగే ఆసియా కప్ లో బరిలోకి దిగనుంది. ఆసియా కప్ లో మొత్తం 8 టీమ్స్ ఒక టైటిల్ కోసం తలపడనున్నాయి. ఆసియా కప్ మొదలయింది 1984లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు టైటిల్ గెలుచుకొని టీం ఇండియా విన్నింగ్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో ప్లేస్ శ్రీలంక. 6 సార్లు శ్రీలంక ఆసియా కప్ ను సొతం చేసుకుంది. పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటికే 8 ట్రోఫీలతో అగ్రస్థానంలో ఉన్న భారత్, తొమ్మిదో టైటిల్ కోసం బరిలోకి దిగబోతోంది. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ఆసియా కప్‌లో భారత జట్టుపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి.