వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా ఈ రోజు గురువారం మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో 2-1తో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా.. కనీసం టీ20 సిరీస్ అయినా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటోంది. దీంతో మిగిలిన రెండు మ్యాచుల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే టీమిండియా ప్రస్తుత సిట్యుయేషన్ చూస్తుంటే రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ఏమో.. కనీసం ఒక్కటైనా గెలిచి సిరీస్ పోగొట్టుకోకుండా పరువైనా నిలబెట్టుకుంటారా? అని భయపడిపోతున్నారు.
దీనికి కారణం.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లిచ్చిన సూపర్ పెర్ఫార్సెన్సే. ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయిపోయిన తర్వాత.. రెండో మ్యాచ్‌లో 37 బంతుల్లో 68 రన్స్ చేసిన అభిషేక్ శర్మ తప్ప ఇంకొక్క బ్యాటర్ కూడా పొరపాటున కూడా ఆసీస్ బౌలర్లని స్ట్రాంగ్‌గా ఎదుర్కోలేకపోయారు. స్ట్రాంగ్‌గా ఎదుర్కోవడం దేవుడెరుగు.. కనీసం వాళ్ల నేమ్ పక్కన డబుల్ డిజిట్ కూడా సంపాదించుకోలేకపోయారు. విచిత్రం ఏంటంటే.. కోచ్ గంభీర్ ప్రియతమ శిష్యుడు, టీమిండియా ఆల్ ఫార్మాట్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా ఆ మ్యాచ్‌లో 33 బంతుల్లో 35 రన్స్ కొట్టి.. అభిషేక్ తర్వాత హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆలోచించండి.. మనోళ్లు ఎంత అద్భుతంగా ఆడారో.
ఇక మన బౌలర్లని ఆసీస్ బౌలర్లు ఓ ఆట ఆడుకుని.. ఆసీస్ ఆ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టింది. నెక్ట్స్ రెండో మ్యాచ్ కూడా అంతే. ఈ సారి అభిషేక్ శర్మ కూడా తక్కువ స్కోర్‌కే అవుటైపోయాడు. ఆల్రెడీ కెప్టెన్సీ భారం మోయలేకపోతున్న గిల్, ఫామ్ లేక నానా తంటాలు పడుతున్న కెప్టెన్ సూర్యలతో పాటు బ్యాటర్లంతా మూకుమ్మడిగా ఫెయిలయ్యారు. అయితే అదృష్టం కొద్దీ చివర్లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయి 23 బంతుల్లో 49 రన్స్ కొట్టడంతో టీమిండియా గెలిచేసింది. కానీ.. ఈ సారి మూడో టీ20 జరగబోయే ఓవల్లో బౌలర్లదే రాజ్యం. అసలే ఆసీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోతున్న మన బ్యాటర్లు.. ఓవల్ లాంటి బౌలింగ్ పిచ్‌పై బలంగా ఆడటం.. మ్యాచ్ గెలవడం అంటే డౌటే అని భయపడుతున్నారు ఫ్యాన్స్. మరి స్కై సేన ఏం చేస్తుందో చూడాలి.