Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!

Continues below advertisement

న్యూజిలాండ్-భారత్ ( India vs New Zealand ) మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లో 68 ఇన్నింగ్స్‌ల్లో 2,966 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మరో 34 రన్స్‌ చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచే అవకాశముంది.

అలాగే శిఖర్‌ ధావన్‌ ( Shikhar Dhawan ), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) రికార్డ్‌ను బ్రేక్‌ చేసే ఛాన్స్‌ కూడా ఉంది. శిఖర్‌ ధావన్‌ 72 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్‌ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మూడువేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌ అవుతాడు. అలాగే వీవీయన్‌ రిచర్డ్స్‌తో ( Vivian Richards ) సమంగా నిలుస్తాడు. 

గాయం బారిన పడిన శ్రేయస్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేతో టీమ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మంచి ఫార్మ్ ను కొనసాగిస్తున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola