ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ( T20 World Cup ) మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ( Daryl Mitchell ), పేసర్ అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh) మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ కోడ్ అఫ్ కండక్ట్ ను ఉల్లంఘించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో అర్ష్‌దీప్ తన ఫాలో-త్రూలో బాల్ ను అందుకొని, బ్యాటర్ డారిల్ మిచెల్‌పైకి విసిరాడు. ఆ బాల్ మిచెల్ ప్యాడ్స్‌కు తగిలింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన చర్యగా పరిగణించిన ఐసీసీ, అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాకుండా, అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. రాబోయే 24 నెలల్లో మరో 3 పాయింట్లు వస్తే, అర్ష్‌దీప్ ఒక టెస్టు లేదా రెండు వన్డేల నుంచి నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ ఘటన జరిగిన వెంటనే ఫీల్డ్ అంపైర్లు అర్ష్‌దీప్‌ను మందలించారు. ఆ తర్వాత అర్ష్‌దీప్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) కూడా మిచెల్‌కు సారీ చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్‌ను హగ్ చేసుకొని సారీ చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.