Harshal Patel Dismissed MS Dhoni | ధోని వికెట్ పడగొట్టిన హర్షల్ | ABP Desam

హర్షల్ పటేల్‌ను ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ ముద్దుగా పర్పుల్ పటేల్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో ఒక బౌలర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే. 2024 సీజన్‌లో కూడా హర్షల్ పటేల్ ఒక రికార్డు సాధించాడని ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ధోని తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 110 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ యావరేజ్ 55 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 224గా ఉంది. ఈ ఐపీఎల్‌లో ధోని ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే అవుటయ్యాడు. ఇందులో ఒకటి రనౌట్. నేటి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనిని హర్షల్ పటేల్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. 2024 సీజన్‌లో ధోనిని ఒక బౌలర్ అవుట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అంతకు ముందు ధోని రనౌట్‌లో కూడా హర్షల్ పటేల్‌కు భాగం ఉంది. ఇంతకు ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనిని రనౌట్ చేసిన త్రో హర్షల్ పటేల్ విసిరినదే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola