Hardik Talking to Tilak in Strategic Timeout | వైరల్ అవుతున్న హార్దిక్ తిలక్ సంభాషణ

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ విజయం కంటే, గ్రౌండ్ లో హార్దిక్ పాండ్యా - తిలక్ వర్మ మధ్య జరిగిన హై-వోల్టేజ్ కన్వెర్జేషన్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికి తిలక్ వర్మ కూడా చాలా స్లోగా ఆడుతున్నాడు. 

స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ దెగ్గరకు వచ్చి ఎదో చెప్పాడు. చాలా సీరియస్ గా రెచ్చగొడుతున్నట్లు హార్దిక్ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాతి ఓవర్ నుంచే తిలక్ వర్మ విశ్వరూపం చూపించాడు. అశోక్ వర్మ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6, 4 లతో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. 

అయితే వాళ్లు ఎం మాట్లాడుకున్నారో హార్దిక్ చెప్పుకొచ్చాడు. "నేను తిలక్‌కు ఒక్కటే చెప్పాను.. 'బాల్ ని సర్రిగా చూడు.. కొట్టు .. అంతే!'. నేను గ్రౌండ్ లో ఎంత గట్టిగా అరిచానంటే నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఆ ఎనర్జీ తిలక్ నుంచి రావాలని కోరుకున్నాను" అని హార్దిక్ వెల్లడించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola