Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
దాదాపుగా మూడు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని తిరిగి టీమ్ ఇండియాలోకి వచ్చాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. వరుస వికెట్లు పడిపోయి టీమ్ కష్టాలో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ సిక్సులతో సత్తా చాటాడు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ... ఇండియాను మొదట్లోనే కుప్పకూల్చింది. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పవర్ ప్లే ముగిసే లోపే ఔట్ అయ్యారు. కాసేపటికే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ పెవిలియన్ చేరాడు.
11.4 ఓవర్లలో భారత్ స్కోర్ 78/4. అప్పుడు వచ్చిన హార్దిక్ .. రాగానే భారీ షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. కరెక్ట్ టైం లో వచ్చి తన టీమ్ ను కాపాడాడు పాండ్య. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20లలో వంద సిక్స్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు హార్దిక్.