Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా

కేకేఆర్‌ చేతిలో ఘోర ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్‌ ఓడిపోయిన బాధలో ఉన్న ముంబైకి.. మైదానంలో హార్దిక్ ప్రవర్తించిన తీరు పెద్ద సమస్యగా మారింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిరాశతో అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం, కోపంతో ప్రవర్తించినందుకు గాను ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినట్టు బీసీసీఐ తేల్చింది. అందుకు హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

ఈ వివాదం కోల్‌కతా ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో జరిగింది. మైదానంలో ముంబై ఫీల్డర్లు క్యాచ్‌లు డ్రాప్ చేయడం, చెత్త ఫీల్డింగ్‌తో పరుగులు ఇస్తుండటంతో మ్యాచ్ చేతుల్లోంచి జారిపోతోందని హార్దిక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓవర్ నాలుగో బంతి వేసిన తర్వాత తిరిగి రన్-అప్ వైపు వెళ్తుండగా.. కోపాన్ని అదుపు చేసుకోలేక వికెట్లపై చేత్తో బలంగా కొట్టి బెయిల్స్‌ను కింద పడేశాడు. లైవ్ మ్యాచ్‌లో హార్దిక్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చనీయాంశమైంది.

మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, గ్రౌండ్ వస్తువులను దుర్వినియోగం చేయడం నేరం. ఈ కారణంగా జరిమానాతో పాటు హార్దిక్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. ఇప్పటికే కెప్టెన్సీపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న హార్దిక్‌కు ఈ జరిమానా మరింత తలనొప్పిగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola