Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్

Continues below advertisement

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్, కెప్టెన్సీ, వివాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న హార్దిక్, రాబోయే వైట్ బాల్ సిరీస్‌లకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నాడు.

తన కెరీర్ ప్రారంభంలో పరుగులు చేయలేదని కాకుండా, కేవలం తన ‘అటిట్యూడ్’ నచ్చకే పలు జట్ల నుంచి తొలగించారని హార్దిక్ తెలిపాడు. అప్పట్లో క్రికెటర్లలా కాకుండా భిన్నంగా, సరదాగా ఉండేవాడినని.. అసలు అటిట్యూడ్ అంటే ఏంటో కూడా తనకు తెలియని వయసది అని చెప్పుకొచ్చాడు. 

ఇక కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ పదవుల కోసం లేదా కెప్టెన్ కావడం కోసం ఆడలేదు. టీమ్ లో ఉన్న 11 మంది నా మాట వింటారు, కాబట్టి కెప్టెన్సీ బ్యాండ్ లేకపోయినా నేను టీమ్ లో కెప్టెన్ గానే భావిస్తాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద గౌరవం, నాయకుడిగా ఉండటానికి కెప్టెన్ కానవసరం లేదు" అని పాండ్యా కామెంట్స్ చేసాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola