Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం

Continues below advertisement

గుజరాత్ టైటాన్స్ టీమ్ కు ఐపీఎల్ 2026 ఫైనల్ రాత్రి ఒక పీడకలలా మిగిలిపోయింది. మొదట మైదానంలో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయి కప్ చేజార్చుకున్న జీటీ టీమ్‌కు.. ఆ తర్వాత ఊహించని రేంజ్‌లో ఒక భారీ ప్రమాదం ఎదురైంది. నరేంద్ర మోదీ స్టేడియం నుంచి మ్యాచ్ ముగించుకుని హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. 

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి దట్టమైన పొగలు, మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. దాంతో గిల్, మిగతా ప్లేయర్స్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరినీ త్వరత్వరగా కిందకు దించేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కానీ, అర్ధరాత్రి పూట జీటీ ప్లేయర్స్ దాదాపు గంటపాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. 

మరోవైపు, వరుస మ్యాచ్‌లు, జర్నీల వల్లే అలసిపోయి గుజరాత్ ఫైనల్లో ఓడిపోయిందా అనే ప్రశ్నకు జీటీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి గట్టి కౌంటర్ ఇచ్చారు. "మేము ఎక్కువ మ్యాచ్‌లు ఆడామని, అలసిపోయామని సాకులు చెప్పి ఆర్‌సీబీ విజయాన్ని తక్కువ చేయం. ఈ పిచ్‌పై 155 రన్స్ చాలా తక్కువ స్కోరు. అయినప్పటికీ మా బౌలర్లు లాస్ట్ వరకు ఫైట్ చేశారు. ఆర్‌సీబీ మా కంటే బెటర్ గా ఆడి కప్ గెలిచింది" అని ఆయన అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola