Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఓటమికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్లే అసలు కారణమా? టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సరిగ్గా ఇదే పాయింట్‌పై గిల్‌ను కడిగిపారేశాడు. ఫైనల్లో గిల్ ఆడిన చెత్త షాట్ చూస్తే.. తనకు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకొచ్చిందంటూ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "ఫైనల్ మ్యాచ్‌లో గిల్ అవుట్ అయిన తీరు చూశాక గుజరాత్ కోలుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. నిజానికి అది వికెట్ పడే బాల్ కాదు. అంతకుముందు బంతికే ఫోర్ కొట్టిన గిల్.. ఆ వెంటనే అనవసరంగా పెద్ద షాట్‌కు ట్రై చేసి వికెట్ పారేసుకున్నాడు. ఈ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడి, సెంచరీతో ఫైనల్‌కు వచ్చిన గిల్.. తీరా కీలకమైన మ్యాచ్‌లో ఇలా చేతులెత్తేయడం దారుణం" అని విమర్శించాడు.

అంతేకాదు, ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లానింగ్‌కు రెండు చేతులెత్తి మొక్కాల్సిందేనని చోప్రా అన్నాడు. పిచ్‌పై స్వింగ్ లేకపోవడంతో ఆర్‌సీబీ బౌలర్లు పక్కా ప్లాన్‌తో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులు వేసి గుజరాత్‌ను దెబ్బకొట్టారన్నాడు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను జోర్డాన్ కాక్స్ పట్టుకుని ఉంటే.. జీటీ కనీసం 150 రన్స్ కూడా చేసేది కాదన్నాడు. గుజరాత్ టీమ్ కేవలం టాప్-3 బ్యాటర్లపైనే అతిగా ఆధారపడడం వల్లే ఫైనల్లో బోర్లా పడిందని, సుందర్ హాఫ్ సెంచరీ చేసినా మిడిల్ ఆర్డర్ ఘోరంగా ఫెయిలైందని తేల్చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola