Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) చేసిన వ్యాఖ్యలు అందరి మనసు గెలుచుకుంటున్నాయి. ఈ గెలుపును ఇద్దరు మాజీ భారత క్రికెటర్లకు అంకితం ఇచ్చాడు. 

తన కోచింగ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026.. ఇలా వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత గంభీర్‌ది. గెలిచిన తర్వాత అతను మాట్లాడుతూ, ఈ ట్రోఫీని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. "ఒక చెట్టుకు పండ్లు కాస్తున్నాయంటే దానికి నీరు పోసి పెంచిన వారిని మర్చిపోకూడదు" అంటూ గంభీర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమ్ కు ఇచ్చిన డిసిప్లిన్, సెల్ఫ్ కాంఫిడెన్స్ ఈ విజయానికి పునాది అని గంభీర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత ప్లేయర్స్ మానసికంగా సిద్ధం చేయడంలో ద్రవిడ్ చాలా కృషి చేసారని అన్నారు. ఇక బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ గురించి మాట్లాడుతూ.. ప్లేయర్స్ ఫిట్‌నెస్, స్కిల్స్ ను  సానబట్టడంలో లక్ష్మణ్ టీమ్, భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిందని ప్రశంసించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola