Lionel Messi Retirement | Fifa World Cup: 16 ఏళ్ల కలను మెస్సీ నెరవేర్చుకుని రిటైర్ అవుతాడా..?
Continues below advertisement
ఒక్కసారి.... ఇంకొక్కసారి ఆ కాళ్లు చిరుతల్లా పరిగెడితే చాలు. ఆ వేగం ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తే చాలు. అదే పనిగా గోల్ పోస్ట్ పై దాడి చేస్తుంటే.... అభిమానుల గోలతో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంటే.... తన దేశపు 36 ఏళ్ల కరవును, తన 16 ఏళ్ల కలను నెరవేర్చుకుంటుంటే..... GOAT... Greatest Of All Time అనే బిరుదుతో ప్రపంచం అంతా కీర్తిస్తుంటే.... వాహ్... ఇలాంటి ఓ కెరీర్ హైలో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎంతమంది ఫుట్ బాలర్లకు ఉంటుంది చెప్పండి. అలాంటి Rarest of the Rarest అవకాశం ముంగిట నిలిచాడు.... ఈ జెర్సీ నంబర్ 10 ఆటగాడు. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ.
Continues below advertisement