FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు

Continues below advertisement

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌కు చేరాయి. అయితే ఈసారి అర్జెంటీనా, స్పెయిన్ జట్లు కేవలం ఆ ప్రెస్టీజియస్ వరల్డ్ కప్ ట్రోఫీ కోసమే కాకుండా.. ఫుట్‌బాల్ చరిత్రలోనే మొదటిసారి ఇవ్వబోతున్న అత్యంత విలాసవంతమైన 'ఛాంపియన్‌షిప్ గోల్డ్ రింగ్స్' కోసం కూడా తలపడబోతున్నాయి. 

ఈ మెగా టోర్నీ ఫైనల్స్ యూఎస్ వేదికగా జరుగుతుండటంతో.. నార్త్ అమెరికన్ స్పోర్ట్స్ కల్చర్ అయిన 'విన్నర్స్ రింగ్స్' ట్రెడిషన్‌ను గౌరవిస్తూ ఫిఫా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే విన్నింగ్ టీమ్ కెప్టెన్, హెడ్ కోచ్‌లకు టెంపరరీ రింగ్స్ ఇస్తారు. ఆ తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీ మరియు విన్నింగ్ టీమ్ ఐడెంటిటీతో కస్టమైజ్ చేసిన 30 ప్రత్యేక బంగారు ఉంగరాలను ఆటగాళ్లకు అందజేస్తారు. 

ఈ స్పెషల్ ఇయర్‌ను గుర్తుచేసుకునేలా కేవలం 2,026 రింగ్స్‌ను మాత్రమే ఫిఫా తయారు చేయిస్తోంది. వీటిలో ఆటగాళ్లకు ఇచ్చేవి కాకుండా మిగిలిన 1,996 రేర్ రింగ్స్‌ను పబ్లిక్ కోసం ఓపెన్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టనున్నారు. వీటి ధర ఎంతో లీక్ చేయనప్పటికీ, వీటిని సొంతం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola