Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

Continues below advertisement

భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరగబోయే సిరీస్ డిసైడర్ మూడో వన్డేకు ముందు.. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరి వన్డే మ్యాచ్ అని, అతను రిటైర్ కాబోతున్నాడనే ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో గొడవపడి విరాట్ కోహ్లీ టీమ్ హోటల్ నుండి వెళ్ళిపోయాడనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. టీమిండియా బస్సు దిగిన తర్వాత ప్లేయర్స్ అంతా హోటల్‌కు వెళ్తుంటే కోహ్లీ మాత్రం వేరే కార్ లో వెళ్ళిపొయ్యాడు. దీనిని కొందరు గంభీర్‌తో విభేదాలుగా చిత్రీకరిస్తున్నారు. 

కానీ అసలు నిజం ఏంటంటే, కోహ్లీ తన ఫ్యామిలీని కలవడానికే ప్రత్యేక అనుమతితో వెళ్ళాడట. రెండేళ్ల క్రితమే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌కు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం మ్యాచ్‌లు, షూటింగ్స్ కోసమే అతను ఇండియాకు వస్తుంటాడు. లండన్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో తన ఇంటికి వెళ్లిన కోహ్లీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola